Ammalakkalu:'పాతాళభైరవి' ఘనవిజయం తరువాత మహానటుడు యన్టీఆర్ జైత్రయాత్ర ఆరంభమైంది. ఆ తరువాత ఆయన చిత్రాలు తెలుగు,తమిళ భాషల్లో రూపొందసాగాయి. 1951లో "పాతాళభైరవి, మల్లీశ్వరి", తరువాతి సంవత్సరం "పెళ్ళిచేసిచూడు, దాసి, పల్లెటూరు" చిత్రాల ఘనవిజయాలతో యన్టీఆర్ తీరే వేరుగా సాగుతూ ఉండేది. ఆయన తరువాతి చిత్రంగా 'అమ్మలక్కలు' రూపొందింది.