Home
Tollywood News
Tollywood News News
-
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ‘సరసాలు చాలు’!
‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యూనిట్ సభ్యులకు సాయికిరణ్ స్క్రిప్ట్ అందించగా, శ్రీమతి శ్రుతిరెడ్డి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. చంద్రాకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్… -
బాలయ్యను కాపీ కొట్టిన పవన్ హీరోయిన్.. కానీ, చివరికి
నివేతా థామస్.. అందం, అభినయం కలగలిపిన హీరోయిన్. టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలను ఎంచుకొని వరుస విజయాలను అందుకొంటుంది. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ గా వచ్చినా వకీల్ సాబ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన నివేతా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన తమ్ముడు నిఖిల్ తో ఫన్నీ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నెట్టింట వైరల్ గా… -
బాయ్ ఫ్రెండ్ తో సినిమా డేట్ కి వెళ్లిన లేడీ సూపర్ స్టార్.. ఫొటోస్ వైరల్
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసిన ఈ జంట అందులో సినిమాలను నిర్మిస్తున్నారు. తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక… -
‘కెజిఎఫ్ 2’ లో ఆ సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్.. ఫ్యాన్స్ కి పూనకాలే
కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరక్కేక్కిన కెజిఎగ్ చిత్రం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో పతత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా ఈ చిత్రం ప్రపంచ స్థాయిలో సినీ ప్రేక్షకులను మెప్పించి హీరో యష్ ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. ఇక ప్రస్తుతం అభిమానులందరూ కేఈజిఎఫ్ పార్ట్ 2 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇపప్టికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ రికార్డులు సృష్టించాయి.… -
పవన్ వన్ మ్యాన్ ఆర్మీ.. ఇస్మార్ట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఒక పక్క ఆమె నటించిన ‘హీరో’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా మరోపక్క పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ని జరుపుకొంటుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి యువరాణిగా కనిపిస్తోంది. ఇప్పటికే చేలా సార్లు పవన్ తో నటించడం గొప్ప వరమని చెప్పుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి పవన్ ని పోగొడ్తలతో ముంచెత్తింది. తాజాగా సోషల్… -
60 ఏళ్ళ ‘ఇద్దరు మిత్రులు’
తెలుగునాట ఓ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా అన్నపూర్ణ వారి ‘ఇద్దరు మిత్రులు’ను పేర్కొంటూ ఉంటారు. అంతకు ముందు 1950లలోనే తెలుగులో ద్విపాత్రాభినయ చిత్రాలు రూపొందాయి. 1950లో తమిళ హీరో ఎమ్.కె. రాధా ద్విపాత్రాభినయం చేసిన ‘అపూర్వ సహోదరులు’ తొలి డ్యుయల్ రోల్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో మన భానుమతి కథానాయిక. తెలుగువారయిన సి.పుల్లయ్యనే దర్శకులు. ఆ తరువాత 1953లో ‘చండీరాణి’లో భానుమతి ద్విపాత్రాభినయం చేశారు.… -
రాజేశ్ ఖన్నా – ఫస్ట్ సూపర్ స్టార్ ఎలా అయ్యారు?
రాజేశ్ ఖన్నాను ఇప్పటికీ హిందీ చిత్రసీమలో “ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా” అంటూ కీర్తిస్తుంటారు. అంటే అంతకు ముందు హిందీ సినిమా రంగంలోని దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ వంటి స్టార్స్ ‘సూపర్ స్టార్స్’ కాదా అన్న అనుమానం కలుగక మానదు. అంతకు ముందు స్టార్ హీరోస్ కు రాజేశ్ ఖన్నాకు తేడా ఉంది. అదేంటంటే, రాజేశ్ కంటే ముందు స్టార్ డమ్ చూసిన వారంతా ముందు తమ సత్తా నిరూపించుకున్న తరువాతే… -
మాటల మాయావి.. పింగళి!
తెలుగు చిత్రసీమలో అసలు సిసలు మాటల మాంత్రికుడు అంటే పింగళి నాగేంద్రరావు అనే చెప్పాలి. తెలుగు సినిమా పలుకుకు ఓ జిలుగునద్దిన ఘనత నిస్సందేహంగా పింగళివారిదే అనడం అనతిశయోక్తి! పింగళి వారి రచనలో జాలువారిన పదాలను పరిశీలించి చూస్తే, వాటిలో గమ్మత్తు ఉంటుంది, మత్తూ ఉంటుంది. ఆపైన మనల్ని చిత్తు చేసే గుణమూ కనిపిస్తుంది. చూడటానికి మనకు బాగా తెలిసిన పదాలనే ఆయన ఉపయోగించిన తీరు గమ్మత్తు చేసి చిత్తు చేస్తుంది పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్… -
తనతో తానే పోటీ పడుతున్న నాగశౌర్య!
యంగ్ హీరో నాగశౌర్య నటించిన రెండు సినిమాలు ఈ యేడాది ద్వితీయార్థంలో విడుదలయ్యాయి. చిత్రం ఏమంటే ఈ రెండు చిత్రాల ద్వారా ఇద్దరు కొత్త దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగశౌర్య, రీతువర్మ జంటగా నిర్మించిన ‘వరుడు కావలెను’ మూవీతో లక్ష్మీ సౌజన్య తొలిసారి మెగాఫోన్ పట్టింది. ఇది అక్టోబర్ 29న విడుదల కాగా ఈ డిసెంబర్ 10న నాగశౌర్య నటించిన ‘లక్ష్య’ మూవీ జనం ముందుకు వచ్చింది. బాధాకరం… -
ఎం.పి బాలశౌరి కుమారుని వివాహానికి అతిథిగా చిరంజీవి
మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం స్నికితతో రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరిగింది. సోమవారం తెల్లవారు ఝామున ఘనంగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో పాటు సన్నిహితులు హాజర్యారు. రెండు రోజులు పాటు జరిగిన ఈ వేడుకలు లో భాగం ఆహుతులను అలరించాయి. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఇక ఈ కార్యక్రమంలో ఏపి మంత్రి పేర్ని…
తాజావార్తలు
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
-
AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
ట్రెండింగ్
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!