చిత్రసీమ బహు విచిత్రమైంది! ఎప్పుడు ప్రేక్షకులు ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియదు. ఒక్కసారి మనసారా స్వాగతించారంటే… మరో ఆలోచన లేకుండా దానిని అంగీకరించాలి. ఆ ప్రోత్సాహాన్ని పునాదిగా చేసుకుని పైకి ఎదగాలి. ఇప్పుడు అదే పనిచేస్తోంది అందాల భామ నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ‘మెహబూబా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న సమయంలో ‘డీజే టిల్లు’ రూపంలో ఆమెకు…
నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘నటసమ్రాట్’ అనే మరాఠీ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగులో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారిగా ‘రంగ మార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. జనవరి ప్రధమార్థంలో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రజా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ శ్యామల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మధు కాలిపు ఈ…
టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక పక్క టాలీవుడ్ సినిమాలో నటిస్తూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను ఛాన్సులు పట్టేస్తుంది. దీంతో అమ్మడి కాల్షీట్లు అస్సలు ఖాళీగా లేవంట. ఇక మొదటిసారి పూజా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే రాజమండ్రి లో షూటింగ్ జరుపుకొంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో అంజలి – జయరామ్ – సునిల్ – శ్రీకాంత్ –…
టాలీవుడ్ హీరో నవదీప్ చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం లవ్ మౌళి. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం.. ఒక బైక్.. ట్రావెలర్ గా కనిపించి మెప్పించాడు. ఇక నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా లవ్ అఫ్ మౌళి అంటూ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఈ…
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నేడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఓ మై ఆద్యా అంటూ సాగే ఈ…
అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశి రాయ్, ప్రతాప్ పోతన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. రాజ్ మదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్లకూరి, మాధురి కాళ్లకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ కోసం ఇండియన్ ఐడిల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ పాడిన గీతాన్ని వాలెంటైన్స్ డే సందర్భంగా ఎస్. ఎస్. తమన్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు నాగరాజు తాళ్ళూరి స్వరరచన చేశారు. ‘గ్రే’ అనేది బ్లాక్ అండ్…
‘సొంతవూరు, గంగపుత్రులు’ వంటి అవార్డ్ విన్నింగ్ మూవీస్ తో పాటు సమాజాన్ని షాక్ కు గురిచేసే ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలనూ రూపొందించారు సునీల్ కుమార్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో బి. బాపిరాజు, ఎం. నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘#69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను మార్చి 4న విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ గురించి ఎస్తర్…
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. కరోనా పాండమిక్ సిట్యుయేషన్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మాధవన్ తెలిపాడు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన సైంటిస్ట్ నంబీ నారాయణన్ జీవితంలోని సంఘటనల ఆధారంగా ‘రాకెట్రీ’ చిత్రాన్ని మాధవన్ తెరకెక్కించాడు. సిమ్రాన్ బగ్గా, రజిత్ కపూర్, రవి…
‘రీమేక్స్ కింగ్స్’ అంటూ కొందరు ఉంటారు. వారిలో రీమేక్స్ తో హిట్స్ పట్టేసిన నటీనటులు ఉండవచ్చు, దర్శకనిర్మాతలూ చోటు సంపాదించ వచ్చు. ఇక సాంకేతిక నిపుణులకూ స్థానం దక్కవచ్చు. అలా రీమేక్స్ లో కింగ్స్ గా నిలచినవారిలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఒకరు. ఆయన తెరకెక్కించిన 13 సినిమాలలో ఒకే ఒక్క సినిమా మినహాయిస్తే, అన్నీ పునర్నిర్మిత చిత్రాలే కావడం విశేషం. తొలి చిత్రం ‘శుభమస్తు’ మళయాళ చిత్రానికి రీమేక్ కాగా, రెండో సినిమా ‘శుభాకాంక్షలు’ తమిళ…