ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అందం సాయి పల్లవి. అందంతోనే కాకుండా అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో హైబ్రిడ్ పిల్ల గా ముద్ర వేసేసింది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో తప్ప నటించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మిస్సింగ్ లో ఉంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఈ సినిమా తరువాత ఒక్క సినిమా ఒప్పుకున్నది లేదు.. కనీసం ఒక వేడుక లోకాని, వేదిక మీద కానీ దర్శనమిచ్చింది…