ఫిదా చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అందం సాయి పల్లవి. అందంతోనే కాకుండా అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనస్సులో హైబ్రిడ్ పిల్ల గా ముద్ర వేసేసింది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో తప్ప నటించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మిస్సింగ్ లో ఉంది. శ్యామ్ సింగరాయ్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ఈ సినిమా తరువాత ఒక్క సినిమా ఒప్పుకున్నది లేదు.. కనీసం ఒక వేడుక లోకాని, వేదిక మీద కానీ దర్శనమిచ్చింది లేదు. దీంతో సాయి పల్లవి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది శ్యామ్ సింగరాయ్ తో పలకరించిన ఈ భామ ఉన్నట్టుండీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది. 2022 మొదలై నాలుగు నెలలు పూర్తి చేసుకున్నా ఆమె మరో సినిమా అంగీకరించకపోవడంతో ఆమె అభిమానులు షాక్ కు గురవుతున్నారు.
సాయి పల్లవి ఎందుకు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది? .. సినిమాలు ఎందుకు అంగీకరించడం లేదు? అస్సలు ఇప్పడూ ఎక్కడుంది ..? అనేది అభిమానులు ఆరాతీస్తున్నారు. ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే కుటుంబంతో గడుపుతుందని సమాచారం. ఇక సినిమాల విషయానికొస్తే ఆమె దగ్గరకు చాలా కథలు వస్తున్నా కథకు ఎక్కువ ప్రాధాన్యత లేకపోయేసరికి సాయి పల్లవి అంగీకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమె ఇంటికే పరిమితమైందని, త్వరలో మంచి కథ వస్తే షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్ అయ్యాక ఇలా ఇంత గ్యాప్ తీసుకుంటే అభిమానులు ఆందోళన పడతారు.. మంచి కథతో త్వరగా రా సాయి పల్లవి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.