వివాదాస్పద దర్శకుడు వర్మ మళ్ళీ నిద్ర లేచాడు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల భేటీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు వర్మ. భేటీలో పాల్గొన్న ఏ ఒక్క సెలెబ్రిటీనీ వదలకుండా అందరిపైనా సెటైర్లు వేస్తున్నారు. నిన్న రాత్రి మెగా బెగ్గింగ్ అంటూ చిరంజీవిని మాత్రమే టార్గెట్ టార్గెట్ చేసిన వర్మ… ఒక్కడినే టార్గెట్ చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో మరి… ఆ ట్వీట్ ను డిలీట్ చేసి ఇప్పుడు…
నిన్న మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. చిన్న సినిమాలకు 5 షోలకు అనుమతి లభించింది. పైగా సినిమా సమస్యలకు పరిష్కారం లభించింది అంటూ అంతా సమావేశం తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో సంతోషంగా చెప్పుకొచ్చారు. మెగాస్టార్ అయితే శుభం కార్డు పడిందని, మరో వారం,…