Toll Gate: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న టోల్ గేట్ ఆపరేటర్ గేటు తీయడం ఆలస్యమైందంటూ అతనిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.