ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా.. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. ఈ కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. హిందూ మతంలో ఈ రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి.. విష్ణువుని పూజిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన ఏకాదశి ఇదే. హిందూ సాంప్రదాయం ప్రకారం..…