TCS Recruits Freshers: ఐటీ రంగంలో మేజర్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. TCS.. కొత్త ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా లక్షా పాతిక వేల నుంచి లక్షన్నర మంది వరకు ఎంప్లాయీస్‌ని తీసుకోనున్నట్లు TCS CEO and MD రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.