దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, కేరళ తదితర రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా వ్యవహారం కొసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య గ్యాప్ ఏర్పడింది. ప్రభుత్వానికి సంబంధించిన బిల్లుల విషయంలో గవర్నర్లు కాలయాపన చేస్తున్నారని ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
గవర్నర్ తమిళిసైని డీఎంకే టార్గెట్ చేసింది.. తెలంగాణలో ప్రభుత్వం తమిళిసైని పట్టించుకోవడం లేదని.. అందుకే చెన్నైలో కాలం గడుపుతున్నారని విమర్శించింది డీఎంకే.. దీనిపై స్పందించిన గవర్నర్.. ఇంట్లో తెలుగు మాట్లాడుతూ.. తమిళ వేశం వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
తలపతి విజయ్ రోల్స్ రాయిస్ ట్యాక్స్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 2012 లో విజయ్ ఖరీదైన లగ్జరీ కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను లండన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. కస్టమ్ డ్యూటీగా దిగుమతి చేసుకోవడానికి అతను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాడు. అన్ని పన్నులు, ఛార్జీలను చెల్లించాడు. కానీ నిబంధనల ప్రకారం ఉన్న ఎంట్రీ ట్యాక్స్ నుండి మాత్రం మినహాయింపుని కోరాడు. దీనిపై అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో కోర్టులో కేసు వేశాడు. ప్రవేశ పన్ను మినహాయింపుకు…