తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కిడ్నాప్‌నకు గురయ్యారనే పుకార్లు షికారు చేశాయి.. అయితే, కిడ్నాప్ వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ.. క్లారిటీ ఇచ్చారు.. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అంటూ ఓ వీడియో విడుదల చేశారు..
Tirupati: తిరుపతి నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 3) ఉదయం 11 గంటలకు ఎస్‌వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరగనుంది. భూమన అభినయ రెడ్డి రాజీనామాతో ఖాళీగా మారిన ఈ పదవికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన పట్టును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్ష కూటమి ఈ స్థానంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు, క్యాంప్ రాజకీయాలు ముదిరాయి. దీనితో గత మూడు రోజులుగా తిరుపతిలో…