తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది..
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో కొనసాగుతోన్న ఉత్కంఠకు తెరపడింది.. విజయం మీదా..? మాదా? అనే ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చివరకు తిరుపతి డిప్యూటీ మేయర్ పోస్టును తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ-భారతీయ జనతా పార్టీ కూటమి కైవసం చేసుకుంది..
తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఇవాళ కూడా ఎన్నికల ప్రక్రియ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్