బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో ఏపీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వైసీపీ తరుఫున దివంగత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉండటంతో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా మారింది. ఓటమిని ముందుగానే గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. అనుహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రేసులో నిలువడంతో ఎన్నిక అనివార్యమైంది.…