గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం పలువురు తమవంతు సాయం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆపన్న హస్తం అందించింది. వరద బాధితుల సహాయార్థం 10 లక్షలు.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్విట్టర్…
కడప, తిరుపతి వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు సీఎం. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు ముఖ్యమంత్రి. హెలికాప్టర్ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన…
ఆధ్యాత్మిక నగరం తిరుమల, తిరుపతిలో జలప్రళయం, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలిచివేస్తున్నాయి. ప్రభుత్వం, టీటీడీ సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతున్నా. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూత ఇవ్వాలని కోరుతున్నా’ అంటూ ట్విట్టర్‌లో చిరంజీవి పోస్ట్ చేశారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం…