తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. లాంగ్ వీకెండ్ రావడంతో అందరూ ఒక్కసారిగా తిరుమలకు చేరుకున్నారు. దీంతో సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈనెల 21 వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్…