టాలీవుడ్ స్టైలిష్ స్టార్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిల్లల గురించి, అల్లు అర్జున్ సినిమాల విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా స్నేహా రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె ఒక్కరే తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
స్నేహా రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు.. అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు.. ఆ తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ కనిపించనుంది. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.. దాదాపు షూటింగ్ పనులు పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది..
ఇకపోతే స్నేహారెడ్డితో పాటు తిరుమలలో డైరెక్టర్ నందిని, నటి ప్రగతి కూడా కనిపించారు. వీరికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. వీరు ముగ్గురు కలిసి వెళ్ళారా అనే విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది..