తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్నినాని
మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు..
తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్.. రంగంలోకి దిగేసింది. ఇవాళ తిరుపతిలో విచారణ జరుపనుంది. దీంతో.. ఎవరిని ప్రశ్నిస్తారు.. ఎవరెవరిపై కేసులు నమోదు చేస్తారనే అంశాలు ఆసక్తిని పెంచుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం.. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న రిపోర్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
తిరుమలకు జగన్ వెళ్లొద్దని ఎవరూ చెప్పలేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమల వెళ్లకుండా ఉండడానికి జగన్కు ఏ సాకులు ఉన్నాయో తెలియదన్నారు. జగన్ తిరుమలకు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. దేవుడి ఆచారాలు, సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించి తీరాల్సిందేనన్నారు.
రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దేశంలో ఎక్కడా పరిస్థితులు ఏపీలో చూస్తున్నామన్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారని.. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు.
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఇవాళ విజయవాడ నుంచి తిరుపతికి నేటి సాయంత్రం వెళ్లాల్సి ఉంది. గతంలో నేటి రాత్రి తిరుమలలో బస చేసి రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తి రేపుతోన్న వేళ.. టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసలు వైఎస్ జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదంటున్నారు భూమన.. ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తిని ఎలా అడిగుతారు డిక్లరేషన్? అని నిలదీశారు.. టీటీడీ డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వం పతనం ప్రారంభం అయినట్లే అవుతుందన్నారు..
వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.. గత కొంత కాలంగా జరుగుతున్న తిరుమల వివాదం తెలిసిందే.. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు.. కల్తీ నెయ్యి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించడం శుభపరిణామంగా పేర్కొన్నారు.