తిరుమల లడ్డూ వ్యవహారంపై కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.
తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. తిరుమలలో అఖిలాండం వద్ద కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. కోట్లాదిమంది ప్రపంచ వ్యాప్త శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీడీపీ ఒడిగట్టిందని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియజేశారు.
నేటి (ఆదివారం) నుంచి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు.
శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ అని ఆయన పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అంటూ తీవ్రంగా విమర్శించారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న వేళ టీటీడీ ఈవో శ్వామలరావు ఆ వివాదంపై స్పందించారు. తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని, శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.