Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరికి సంబంధించిన విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం వికారాబాద్‌లోని అనంతగిరి కొండ పైనుంచి కిందకు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయినప్పటికీ.. ఆయన చాకచక్యంగా బస్సును అదుపు చేసి అందులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. అయితే, నేడు అదే బస్సు ప్రమాదానికి గురై ఆయన మృతి చెందడం అత్యంత బాధాకరం.…