Zimbabwe: ఆఫ్రికా దేశం జింబాబ్వే కఠినమైన అడవులు, వన్యప్రాణులకు కేంద్రంగా ఉంది. ఇలాంటి అడవుల్లో ఎవరైనా తప్పిపోతే దాదాపుగా మరణమే శరణ్యం. అలాంటిది ఓ 8 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతంగా బయటపడిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తగా నిలిచింది. ఉత్తర జింబాబ్వేకి చెందిన బాలుడు కఠినమైన అడవి పరిస్థితులను ధిక్కరించి విజయం బయటపడపడ్డాడు.