TikTok Ban: ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ (TikTok) తన సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ విషయాన్ని సందేశాల ద్వారా తెలియజేస్తోంది. జనవరి 19 నుండి టిక్‌టాక్‌పై నిషేధం అమల్లోకి రానుండటంతో, మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘జనవరి 19 నుంచి అమెరికాలో టిక్‌టాక్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం’’ అని టిక్‌టాక్ యూజర్లకు పంపిన సందేశంలో పేర్కొంది. 2017లో ప్రారంభమైన ఈ షార్ట్ వీడియో యాప్‌పై ఇప్పటివరకు…
Donald Trump On Tiktalk: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, టిక్‌టాక్‌పై నిషేధాన్ని నిలిపివేయాలని సుప్రీం కోర్టును కోరారు. టిక్‌టాక్‌ను నిషేధించే చట్టాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, సమస్యకు రాజీ పరిష్కారం సాధించేందుకు మరికొంత సమయం కావాలని ఆయన అభ్యర్థించారు. జనవరి 19, 2025 వరకు నిషేధ గడువును పొడిగించాలని ట్రంప్ కోరుతున్నారని తెలుస్తోంది. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో టిక్‌టాక్‌ను నిషేధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో యువ ఓటర్లను,…
TikTok: భారత్ జాడలోనే అమెరికా నడిచింది. చైనాకు షాక్ ఇస్తూ ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారం టిక్ టాక్‌కి వ్యతిరేకం బిల్‌ని ఆమోదించింది. యూఎస్ ప్రతినిధుల సభ భారీ మెజారిటీతో బిల్లుకు బుధవారం ఆమోదం తెలిపింది. టిక్ టాక్‌ని తన చైనా ఓనర్ బైట్ డ్యాన్స్ నుంచి బలవంతంగా ఉపసంహరించుకోవాలనే బిల్లుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఒక వేళ ఇది జరగకుంటే అమెరికాలో టిక్ టాక్‌ని నిషేధించవచ్చు.