జాతీయ రహదారిపై పులి కనిపించింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటింది. రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు.. హడలెత్తిపోయారు. కారు, లారీ లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌లుసెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా ఈరోజు ఉదయం అడవి పందిని పులి చంపి అడవి పంది మాంసాన్ని తిని పెద్దపులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి దాడితో రైతు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అధికారులకు మొర పెట్టుకోవడంతో పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పరిసర గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే.. పెద్దపులిని బంధించడానికి ఫారెస్ట్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. పశువులపై చేస్తున్న దాడి పరంపరను కొనసాగిస్తున్న పులి.. ఒమ్మంగి – శరభవరం గ్రామాల మధ్య రాత్రి మరోసారి సంచరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొదురుపాక పొలిమేరలో మరో ఆవు దూడపై పులి దాడి చేసినట్లు సమాచారం. అయితే.. సీసీ కెమెరాల్లో పులి విజివల్స్ రికార్డు అయ్యాయి.…