Tiger Wandering: అలర్ట్.. దర్జాగా రోడ్డు దాటిన పెద్దపులి.. ఎక్కడంటే?
- జాతీయ రహదారిపై పులి
- నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటిన టైగర్
- . రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు
- కెమెరాల్లో బంధించిన డ్రైవర్లు
- అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రహదారిపై పులి కనిపించింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటింది. రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు.. హడలెత్తిపోయారు. కారు, లారీ లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌లుసెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా నిర్మల్ జిల్లాలో ఈ పులి సంచరిస్తోంది. కవ్వాల్ టైగర్ జోన్ వైపు దారి మళ్ళినట్లు సమాచారం. ఇస్ పూర్, గౌలిగూడ, చింతగూడ,లింగట్ల ,ఆరెపల్లి, వాంకిడి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులి రాకతో ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నేరడి గొండ అటవీ శాఖ సిబ్బంది పులి కదలికలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తోంది.
READ MORE: Manipur : మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. కాల్పులు, బాంబు దాడి.. ప్రతిస్పందించిన భద్రతా దళాలు
Also Read
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
ఇదిలా ఉండగా.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని పెద్ద ధర్మారం సమీపంలోకి శనివారం తెల్లవారుజామున పెద్దపులి వచ్చింది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆదివారం మామిడిగూడెం పంచాయతీ గోండుగూడకు చెందిన చిత్రు అనే గిరిజన రైతుకు చెందిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి మూడు ఆవులను చంపిన విషయం తెలిసిందే. సురక్షిత ఆవాసం కోసం వెతుకుతూ మూడు రోజుల క్రితం పెద్దపల్లి కవ్వాల అభయారణ్యంలోకి వెళ్లినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున పెద్ద ధర్మారం గ్రామానికి అతి సమీపంలోని రహదారిపై పులి అడుగులు కనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. పంటచేన్లలో కాపలా ఉన్న కొందరికి పెద్దపులి అరుపులు వినిపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పత్తి పంట చేతికి రావడంతో పులి భయంతో పత్తి తీసేందుకు కూలీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ముత్యంపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెద్దపులి రావడంతో అటవీ శాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అడవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. పులిని గుర్తించేందుకు ట్రాకింగ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులికి ఎలాంటి హానీ తలపెట్టకుండా ఉండేందుకు స్ధానిక అటవీ శివారు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
తాజావార్తలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
-
iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?