కాకినాడ జిల్లా వాసులకు మూడు వారాలుగా గుండెల్లో దడపుట్టిస్తోంది ఆ పెద్దపులి. తాజాగా శంఖవరం మండలం కొంతంగి ఎర్రకొండ పై పులి సంచారం కనిపించిందంటున్నారు. పులి కనిపించిందని చెప్తున్న కొండపై జీడిపిక్కల కోసం వెళ్ళారు కొందరు యువకులు. భయంతో పరుగులు తీసిన యువకులు ఈ సంగతి ఊళ్ళోకి వచ్చి చెప్పారు. గత కొద్దిరోజులుగా ఎక్కడో చోట అలజడి కలిగిస్తూనే వుంది. దానిని బంధించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించడం లేదు. దీంతో చీకటి పడ్డాక గడప…
ఒక్క పులి.. అధికార యంత్రాంగాన్ని, సమీప గ్రామాల ప్రజల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో 12 రోజులుగా పెద్ద పులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులి దాడికి గేదెలు, ఆవులు, ఇతర జంతువులు గాయాల పాలవుతున్నాయి. మరికొన్ని చనిపోతూ యజమానులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా పొదురుపాక వద్ద ఆవుని చంపిన పులి.. గురువారం రాత్రి శరభవరం వద్ద రెండు గేదెలపై దాడి చేసింది. పులి దాడి నుంచి గేదెలు గాయాలతో తప్పించుకున్నాయి. పులి…