Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
Rain Alert : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ, మధ్య మహారాష్ట్ర దుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు, ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. ఈ వాతావరణ వ్యవస్థ దక్షిణ-పశ్చిమ దిశగా వాలి ఉన్నదని, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. శనివారం ఉత్తరాంధ్ర తీరాన్ని ప్రభావితం…
తెలంగాణలో వాతావరణం తేలియాడుతోంది. ఎప్పుడు ఎండలు పీక్ స్టేజ్‌లో ఉంటాయో, ఎప్పుడు ఆకస్మికంగా వర్షం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ హెచ్చరిస్తున్నారు.
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.