ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో ఈ సాయంత్రం పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా జిల్లాలలో రైతులు వెంటనే పొలాల నుంచి ఇంటికి చేరుకోవాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన…