ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజేష్ రిషి, నరేష్ యాదవ్, రోహిత్ కుమార్ మెహ్రాలియా శుక్రవారం రాజీనామా చేశారు.