ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నేషనల్ నంబర్స్‌తో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా ఫోన్ చేసి దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించినట్లు తెలిసింది.
Threatening calls: నెల్లూరు రాజకీయాల్లో కాకరేపిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఇప్పుడు బెదిరింపుల పర్వం మొదలైందట.. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని.. ఆరోపణలు చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కడప జిల్లా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన అనిల్ అనే వ్యక్తి కోటంరెడ్డికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల…