ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాను బెదిరించిన వ్యక్తిని ఘజియాబాద్, ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది. కొత్వాలి ప్రాంతం నుంచి శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు తన భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఉన్నప్పుడు ఫోన్ చేసి బెదిరించాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పేర్కొంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తి మహిళగా గుర్తించారు. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ కాల్ రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు చేయబడింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను లష్కరే తోయిబా సీఈఓనని చెప్పాడు. శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రిజర్వ్ బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఈ కాల్ వచ్చింది. ఫోన్‌లో ఉన్న వ్యక్తి.. "నేను లష్కరే తోయిబా సీఈఓని, బ్యాక్‌వే మూసేయండి. ఎలక్ట్రిక్ కారు చెడిపోయింది." అని చెప్పాడు.
చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్‌లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను చంపుతానంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ఆ వ్యక్తి ముంబై పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిగ్నల్ ద్వారా అతడిని ట్రేస్ చేసిన అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయం బయట పెట్టాడు. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను…
ప్రధాని నరేంద్ర మోడీకి బెదిరింపు కాల్ వచ్చింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి.. మోడీని చంపుతానని బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. బెదిరింపు కాల్ ను ట్రేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.