ఇవాళ (మే 18) ప్రగతి భవన్‌కు వచ్చిన తిమ్మక్కను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘనంగా సన్మానించారు. “వృక్షమాత” తిమ్మక్క తెలంగాణ ప్రజలందరికి స్పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. మొక్కలు నాటడమంటే కార్యక్రమం కాదని.. మనల్ని, మన భవిష్యత్ తరాలను బ్రతికించే మార్గమని అన్నారు. ఆ బాధ్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని.. తిమ్మక్క మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం తిమ్మక్క మాట్లాడుతూ.. తెలంగాణ…