ఏపీలో టికెట్ రేట్ల విషయంపై వివాదం కొనసాగుతోంది. డిస్ట్రిబ్యూటర్ల ఆవేదనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని పట్టుబట్టింది. దీంతో ఇప్పటికే పలువురు థియేటర్ యాజమాన్యాలు నష్టాల్లో సినిమాలను ప్రదర్శించలేక స్వచ్చందంగా థియేటర్లను క్లోజ్ చేసేసుకున్నారు. మరోవైపు థియేటర్లపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ తనిఖీల్లో చిత్తూరు జిల్లాలో 17 సినిమా థియేటర్లు మూత పడ్డట్లు సమాచారం. మదనపల్లి, కుప్పం, పలమనేరు పుంగనూరులలో నిన్న మధ్యాహ్నం నుంచే షో లు రద్దు…