టెక్నికల్గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు. మంత్రులు పనిచేసిన గ్రామాల్లో కూడా వారి చెంప చెళ్లుమనిపించారు. కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. డబ్బు సంచులు, మద్యం బాటిల్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం పనిచేయదని మరోసారి నిరూపితమైందన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయ దుందుభి మ్రోగిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శామీర్ పేట నివాసం నుండి ఆయన మాట్లాడుతూ.. ఫలితాల్లో జాప్యం తగదని మండిపడ్డారు.