Temple-Mosque disputes: మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
RSS: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సైద్ధాంతిక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ బీజేపీ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేసింది