బంగ్లాదేశ్ హింసాకాండ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ప్రకటన చేశారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ సందర్భంగా విక్టోరియా హౌస్ ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ప్రజలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.