గత యేడాది కేవలం ‘లవ్ స్టోరీ’ మూవీతో సరిపెట్టుకున్న అక్కినేని నాగచైతన్య ఈ సంవత్సరం మాత్రం మూడు చిత్రాలతో సందడి చేయబోతున్నాడు. అన్నీ అనుకూలిస్తే మరో సినిమా కూడా విడుదల కాకపోదు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా నాగచైతన్య, తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన ‘బంగార్రాజు’ మూవీ విడుదలై, మోడరేట్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఇక తొలిసారి నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న…