Chiyaan Vikram: తంగలాన్ టీజర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ… విక్రమ్ మరో నేషనల్ అవార్డ్ ఇచ్చేయొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివపుత్రుడు, ఐ, శేషు లాంటి సినిమాల పేర్లు వినగానే ఆ క్యారెక్టర్స్ ని మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన చియాన్ విక్రమ్ గుర్తొస్తాడు. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించగల విక్రమ్ చేసిన సినిమాలు బోగోలేవు అనే మాటని చాలా సార్లు వినుంటాం కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకూ వినిపించలేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న విక్రమ్, ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కొత్త దర్శకులు, కొత్త కథలు అంటే విక్రమ్ ముందుంటాడు అందుకే అతని ఖాతాలో ఫ్లాప్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా రోజుల తర్వాత విక్రమ్, హిట్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ‘పా. రంజిత్’ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న సినిమా ‘తంగలాన్’. స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. విక్రమ్ కెరీర్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా తంగలాన్ తెరకెక్కుతోంది.
జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలైట్ గా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా భారి బడ్జట్ తో రూపొందుతున్న తంగలాన్ సినిమా అప్డేట్ కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ తంగలాన్ టీజర్ బయటకి వచ్చింది. నిమిషమున్నర నిడివితో కట్ చేసిన తంగలాన్ టీజర్… ప్రతి ఫ్రేమ్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. యుగానికి ఒకడు, మరుదనాయగం సినిమాలు గుర్తు చేసే రేంజులో తంగలాన్ సెటప్ ఉంది. విక్రమ్ గెటప్, ఆర్టిస్టుల లుక్ ఇంతక ముందెప్పుడూ చూడని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా విక్రమ్ అయితే క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉన్నాడు. టీజర్ కి జీవీ ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. టీజర్ లో విక్రమ్, పాముని చేత్తోనే ముక్కలు చేసే సీన్ లో విజువల్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలి అంటే తంగలాన్ టీజర్ చూడగానే విక్రమ్ ఖాతాలో మరో నేషనల్ అవార్డ్ గ్యారెంటీ అనే కామెంట్స్ చేస్తున్నారు అంటే టీజర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
The son of Gold rises🔥⚔️
Unveiling the spine-chilling #ThangalaanTeaser✨
▶️https://t.co/Comqkxth5M#Thangalaan #ThangalaanFromJan26@Thangalaan @chiyaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_ @PasupathyMasi @DanCaltagirone @thehari___…— Vikram (@chiyaan) November 1, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!