నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది.
సినిమాల పరంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా ధూత సిరీస్‌తో ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఇదే జోష్‌ని కంటిన్యూ చేస్తూ… ఇప్పుడు తండేల్‌గా జెట్ స్పీడ్‌లో దూసుకొస్తున్నాడు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటి… ఈసారి చైతన్యకు సాలిడ్ హిట్ ఇవ్వాలని భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గతంలో చందు, చై కలిసి చేసిన ప్రేమమ్, సవ్యసాచి అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఈసారి శ్రీకాకుళం నేపథ్యంలో…