ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘తండేల్’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన లభించగా.. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘బుజ్జి తల్లి, శివ శక్తి, హైలెస్సో హైలెస్సా’ పాటలు మారుమోగుతున్నాయి. అలాగే యూట్యూబ్‌లో ఈ సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ విషయంలో…