టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుందన్న వార్తలు వినిపిస్తూనే వున్నా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఈ తెలుగు సినిమా రీమేక్ లో నటించడానికి కార్తీక్ ఆర్యన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కథానాయికగా నటించనుందట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. అయితే ఇటీవలే ఓ నిర్మాత అల్లు అరవింద్ ను కలిసి ఓ నిర్ణయానికి వచ్చినట్లు…
నేడు నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా సర్‌ప్రైజ్ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ-బోయపాటి శ్రీను సినిమా నుంచి ‘అఖండ’ న్యూ పోస్టర్ విడుదల కాగా.. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో #NBK107 సినిమా వుండనుందని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై చిన్న వీడియోతో నందమూరి అభిమానులను…
నేడు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి కావడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పించింది. చాలా మంది ప్రముఖులు ఆయన్ను స్మరించుకున్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ బాలు లేని లోటు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాలుతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. ‘మిస్ యూ మామా’ అంటూ చిన్ననాటి ఫోటో షేర్ చేశారు. 1996 దక్షిణ కొరియాలోని సియోల్ ఎయిర్ పోర్టులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమన్…
ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజికల్ వార్ ఎవరి మధ్య అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పేది దేవిశ్రీప్రసాద్, థమన్ పేర్లే. ఇద్దరూ గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఏ స్టార్ సినిమా ఆరంభిస్తున్నా… మ్యూజిక్ గురించి ముందుగా సంప్రదించేది వీరిద్దరినే. మరి వీరిద్దరూ సినిమాకు ఎంత వసూలు చేస్తారనే విషయం చాలామందికి ఆసక్తి కలిగించే అంశం. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు దేవిశ్రీప్రసాద్ నాలుగు కోట్ల వరకూ ఛార్జ్ చేస్తారని, థమన్ 3…