13 Indians trapped in fake IT job racket rescued from Myanmar: నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించారు. మయన్మార్ దేశంలో ఐటీ జాబ్స్ కోసమని వెళ్లారు 45 మంది భారతీయులు. అయితే అక్కడి వెళ్లాక కానీ తెలియలేదు తామంతా మోసపోయామని. మయన్మార్ లోని మైవడ్డీ ప్రాంతంలో అంతర్జాతీయ జాబ్ రాకెట్ బారిన పడిన 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్…
Viral News: అదొక బీచ్.. సాయంసంధ్య వేళ పర్యాటకులందరితో కళకళలాడుతోంది. కుటుంబాలు వారి పిల్లలతో జలకాలాడుతున్నారు. ఇక అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారిగా అలికిడి మొదలయ్యింది.
Gotabaya Rajapaksa To Seek Temporary Stay In Thailand: శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స మరో దేశం ఆశ్రయం కోరాడు. గత నెలలో శ్రీలంక వ్యాప్తంగా ప్రజానిరసనలు మిన్నంటాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స శ్రీలంకను వదిలి ఆర్మీ విమానంలో మాల్దీవులకు పారిపోయాడు. అయితే అక్కడ కూడా శ్రీలంక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో జూలై 14న సింగపూర్ దేశానికి పారిపోయాడు. అప్పటి నుంచి…
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే భారీ నిరసనల మధ్య గత నెలలో తన ద్వీప దేశం నుండి పారిపోయిన తర్వాత రెండవ ఆగ్నేయాసియా దేశంలో తాత్కాలిక బస కోసం థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించాలని అభ్యర్థించినట్లు థాయ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
జంతువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు ఇండియన్ మహిళలను థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకాక్ సువర్ణభూమి అంతర్జాతీయ విమానశ్రయంలో వీరిద్దరి లగేజ్ చెక్ చేయగా..రెండు సూట్‌కేసుల్లో 109 సజీవ ప్రాణులను పట్టుకున్నారు. థాయ్ లాండ్ అధికారులు ఎక్స్ రే స్కానర్ల ద్వాారా చెక్ చేస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. రెండు రెండు సూట్‌కేసుల్లో రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లలు, 35 తాబేళ్లు, 50 బల్లలు, 20 పాములను పట్టుకున్నారు. థాయ్ లాండ్ నుంచి…
భారత్‌లో గంజాయి సాగు చేయడం నిషేధం. భారత్‌లోనే కాదు… ఆసియా దేశాల్లో గంజాయి సాగు చేసినా, తరలించినా, విక్రయించినా, వినియోగించినా నేరమే. కానీ.. థాయ్‌లాండ్ ప్రభుత్వం గంజాయి సాగుతోపాటు, దాని వినియోగాన్ని కూడా చట్టబద్ధం చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం..…
టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నా మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కొంత మంది ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. ఇలాంటి వాళ్ల కారణంగానే దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. అమాయక ప్రజలే దొంగ బాబాల పెట్టుబడి. అయితే ఈ మూఢ నమ్మకాలు మన దేశానికే పరిమితం కాలేదు. పక్క దేశాలలో కూడా దొంగ బాబాలు చెలామణి అవుతున్నారు. తాజాగా థాయ్‌లాండ్‌లో ఓ దొంగ బాబా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడు. తన మల, మూత్రాలు ఔషధంలా పనిచేస్తాయని, రోగాలు…
ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్‌వార్న్ ఈనెల 4న థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో రోజుల తర్వాత వార్న్ డెడ్‌బాడీ ప్రత్యేక విమానం ద్వారా గురువారం నాడు థాయ్‌లాండ్ నుంచి ఆస్ట్రేలియాకు చేరుకుంది. శవపేటికలో వార్న్ భౌతికకాయాన్ని ఉంచి ఆస్ట్రేలియా జాతీయ పతాకం దానిపై కప్పారు. థాయ్‌లాండ్‌లోని డాన్ మ్యూంగ్ అనే ఎయిర్ పోర్టు నుంచి మెల్బోర్న్కు డసాల్ట్ ఫాల్కన్ 7ఎక్స్ చార్టర్డ్ విమానంలో షేన్‌వార్న్ మృతదేహాన్ని థాయ్ ప్రభుత్వం తరలించింది.…
రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆమెకు బల్లిజాతికి ఓ పెద్ద ఉడుము కనిపించింది. భయపడిన ఆ యువతి వెంటనే అక్కడే ఉన్న ప్లాస్టిక్ కుర్చి ఎక్కింది. పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులకు భయపడిన ఆ ఉడుము ఆ యువతి మీదకు దూకే ప్రయత్నం చేసింది. దీంతో మరింత బిగ్గరగా అరడం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరిగెత్తుకు వచ్చి దానిని అక్కడి నుంచి తొలగించే…