అమరావతి: నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలతో భేటీ. హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు. తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం. జూన్ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి.…
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు తీవ్రమైన తప్పిదాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రంగంలోకి దిగారు. వేలాది మంది అభ్యర్థులు ఆయనను కలిసి గ్రూప్-1 అక్రమాలపై వినతి పత్రాలు అందజేస్తుండటంతోపాటు ఆ నియామకాలను రద్దు చేయాలని, మళ్లీ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాలని కోరుతున్న నేపథ్యంలో బండి సంజయ్ గ్రూప్-1 పరీక్షా ఫలితాలపై టీజీపీఎస్సీ నుండి సమాచారం తెప్పించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు…
గ్రూప్-1 అభ్యర్థుల నియామకంపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పరీక్షపై టీజీపీఎస్సీ అప్పీల్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ గ్రూప్-1 లో భారత దేశ చరిత్రలోనే పెద్ద స్కాం జరిగింది. గ్రూప్ మెయిన్స్ కు ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్ కు మరో హాల్ టికెట్ ఇచ్చారు.. పరీక్ష రాసింది 21,093అయితే ..ఫలితాలు 21,103 మందికి ఇచ్చారు.. పరీక్ష రాయకుండానే…
TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం ఓ ముఖ్య ప్రకటనను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసీడీఎస్ వెర్హౌస్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (పాత…
TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 ఎంపికైన అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియను ఏప్రిల్ 16, 17, 19 మరియు 21 తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ప్రదర్శించింది. అభ్యర్థులు తమ పేర్లు పరిశీలించుకొని, నిర్ణీత తేదీన అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలి. అంతేకాకుండా, ఏప్రిల్ 15 నుండి…
కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. అంకితభావంతో కష్టపడితే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు యువతీ యువకులు. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ కు క్రేజ్ ఎలా ఉందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే.. పోటీపడే వారు లక్షల్లో ఉంటున్నారు. ఇంతటి హెవీ కాంపిటిషన్ లో కూడా ఓ యువకుడు అసాధారణ ప్రతిభకనబర్చాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 10 ప్రభుత్వ కొలువులను సాధించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇంతకీ ఆయన ఎవరంటే భూపాలపల్లి…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ వన్‌లో నిలిచింది. 52 మంది 500 కు పైగా మార్క్ లు సాధించారు.
TGPSC : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ (TSPSC) వరుసగా ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో, మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) ఉద్యోగ రాత పరీక్షల తుది ఫలితాలు ప్రకటించింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆధికారిక వెబ్సైట్ (www.tspsc.gov.in) ద్వారా చూడవచ్చు. మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉంది. అలాగే, ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో…
హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యాలయం ముందు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా.. పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మోహరించాయి. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో నిరసనలు జరుగుతాయామోనని ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఉన్నారు.