ఫిబ్రవరి20 వ తేదీ రాత్రి బట్టుపల్లి రోడ్ అమ్మవారిపేట క్రాస్ రోడ్ వద్ద సుమంత్ రెడ్డి అనే డాక్టర్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడిచేసి చంపడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. తమ అక్రమసంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలసి భర్తను చంపాలని భార్య పథకం వేసినట్లు గుర్తించారు. వారికి స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకరించాడు.
మంచిర్యాల జిల్లా.. నస్పూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై ఎస్సై దురుసుగా ప్రవర్తించాడని బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.. తమపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు.. పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బీజేపీ నాయకులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.
సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగోతో ఏపీకే ఫైల్స్ (APK files) పంపుతున్నారు.
Telangana BJP: నేడు ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది.