అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అక్కడ గన్ కల్చర్ ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తోంది.ఇటీవల కాలంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో అభంశుభం తెలియని స్కూల్ పిల్లలు మరణించారు. ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది స్కూల్ పిల్లలు, మరో ముగ్గురు మొత్తంగా 21 మంది చనిపోయారు. టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.…