ఇటీవల చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును టవేరా ఢీకొట్టింది. మెట్‌పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టవేరా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి టవేరా వెహికల్ నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో టవేరా వాహనంలో ప్రయాణిస్తున్న కోరుట్లకు చెందిన పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటక లోని గన్గాపూర్ దేవాలయానికి దర్శనానికి వెళ్లి…