సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నెలల్లో ఆ దేశానికి వెళాల్సిన టీం ఇండియా వెళ్తుందా.. లేదా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ పర్యటన జరుగుతుంది అని ప్రకటించిన బీసీసీఐ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 న ప్రారంభం కానుండగా… చివరి వన్డే మ్యాచ్ జనవరి 23న ముగుస్తుంది. అలాగే ఈ పర్యటనలో టీ20 సిరీస్…
మొన్నటి వరకు కరోనా మహమ్మారి కేసులు.. మన దేశంలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా కరోనా మహమ్మారి… ఒమిక్రాన్ రూపాంతరం చెంది… పంజా విసురుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక ఈ వైరస్ ఎఫెక్ట్.. భారత్ – న్యూజిలాండ్ రెండో టెస్ట్ పై పడింది. న్యూజిలాండ్ తో రెండో టెస్ట్ కు… లిమిటెడ్ గానే… ప్రేక్షకులను అనుమతి ఇస్తామని పేర్కొంది ముంబై క్రికెట్ అసోషియేషన్. ఈ నేపథ్యంలోనే… 33 వేలు…
భారత్-ఇంగ్లాండ్ జాత్మ మంధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన 5 వ టెస్ట్ మ్యాచ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత జట్టులో కరోనా కేసులు నమోదుకావడంతో ఈ మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్ ను మళ్ళీ నిర్వహిస్తారా… లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించారు. దాదా మాట్లాడుతూ… ఈ 5 టెస్టుల సిరీస్ పూర్తిగా జరగాలి. ఇప్పటికే 2-1…
మొదటి రెండో టెస్టు వరకూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది మన భారత బ్యాట్స్ మెన్ యేనా? అంతగా విరుచుకుపడ్డ వీరు మూడో టెస్ట్ నుంచి ఇలా అయిపోయిరేంటి? ఎందుకిలా పేకమేడలా కుప్పకూలుతున్నారు? అసలు మన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఏమైంది. పట్టుమని 10 పరుగులు చేయడానికి ఎందుకింతలా ఆపసోపాలు పడుతున్నారు? ప్రపంచ క్రికెట్లో భారత ప్లేయర్లకు మంచి గుర్తింపు ఉంది. మనోళ్లు బ్యాట్ పట్టారంటే ఫోర్లు.. సిక్సర్లు.. రన్సే రన్స్ అన్న లెవల్లో చెలరేగి పోతుంటారు.…
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో…భారత్ బ్యాట్స్‌మెన్లు పోరాడుతున్నారు. నాలుగో రోజు ఆట నిలిచిపోయేసరికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు. రిషభ్ పంత్ 14 పరుగులు, ఇషాంత్ శర్మ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి రోజు రిషబ్ పంత్ ధాటిగా ఆడి పరుగులు సాధిస్తే….భారత్ ఓటమి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయ్. పంత్‌కు…టెయిలెండర్లు ఎలా సహకారం అందిస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సిడ్నీ…
ఇంగ్లండ్ మరియు టీమిండియా జట్ల మధ్య రెండో టెస్ట్ ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే… ఈ టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది. అయితే.. కాసేపటి క్రితమే.. ఈ మ్యాచ్ టాస్ వేశారు. ఇందులో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి… బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. జట్ల వివరాలు : ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లే, హసీబ్ హమీద్, జో రూట్ (సి), జానీ బెయిర్‌స్టో, జోస్…
వరుణుడి కారణంగా తొలి టెస్ట్‌లో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన టీమిండియా.. సిరీస్‌లో బోణీ చేయాలన్న పట్టుదలతో ఉంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో గురువారం నుంచి జరిగే రెండో టెస్ట్‌లో భారత్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్ట్ ఆఖరి రోజు వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా కనిపించినా.. టాపార్డర్ వైఫల్యం కలవరపాటుకు గురి చేస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు చటేశ్వర్…
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ -ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్ బృందం సన్నద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్.. 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లండ్. నాటింగ్ హాంలో జరిగే మ్యాచ్‌లో శుభారంభం చేసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్ వేస్తోంది ఇంగ్లీష్ టీమ్. అయితే కీలకమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆర్చర్…
ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా క్రికెటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయ్యాక 20 రోజుల పాటు రిలాక్స్ అయ్యే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. కోహ్లీ సేన జూన్ 23న బయో బబుల్‌ను వీడితే.. తిరిగి జులై 14న బబుల్‌లోకి ప్రవేశించనుంది. ఈ మూడు వారాల పాటు భారత బృందం.. యూకే పరిధిలో ఎక్కడ గడుపుతారన్నది వారి వ్యక్తిగత విషయమని బీసీసీఐ తేల్చింది. నాలుగున్నర నెలల పాటు సాగే సుదీర్ఘ పర్యటన…