Terrorists Grenade Attack In Jammu And Kashmir: భారత్ ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సమయంలో దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని ఖైమో ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు.
Jammu Kashmir: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాల హెచ్చరికలతో దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు భద్రత బలగాలు క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. కొన్నాళ్ల నుంచి స్తబ్డుగా ఉన్న ఉగ్రవాదులు మరోసారి నాన్ లోకల్స్ ని టార్గెట్ చేశారు. గతంలో కూడా ఇలాగే హిందూ పండిట్లను, స్థానికేతరులపై దాడి చేశారు.