భారతదేశ సరిహద్దులు దాటొచ్చిని ముష్కరులకు భారత భద్రత దళాలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అయితే తాజాగా.. పుల్వామాలోని ద్రాబ్‌గామ్ ప్రాంతంలో మరో ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు హతమార్చాయి. శనివారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే. అయితే.. దీంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. వారంతా లష్కరే తొయీబాకు చెందిన ఉగ్రవాదులని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. వారిని ఫాజిల్ నజీర్ భట్, ఇర్ఫాన్ మాలిక్, జునైద్ షీర్గోజ్రీగా గుర్తించారు.
గత నెల 13న అమరుడైన జవాన్ రియాజ్ అహ్మద్‌ను చంపినవారిలో జునైద్ కూడా ఉన్నాడని ఐజీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. వీరంతా స్థానికులేనని ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. కాగా, శనివారం ఉదయం కుల్గాం జిల్లాలో కూడా ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నది. ఖాందీపొరలో ఉగ్రవాది ఉన్నాడన్న సమాచారంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన రసీక్ అహ్మద్ గనీ హతమయ్యాడు.