భారత్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరు పాకిస్థాన్‌లో హతమయ్యాడు. సోమవారం సాయంత్రం రావల్పిండిలోని ఓ దుకాణం బయట హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలం హత్యకు గురయ్యాడు.
హైదరాబాద్ పేలుళ్ల కుట్రకేసులో సినిమాను తలపించే విధంగా రహస్యాలు బయటకు వస్తున్నాయి. నగరంలో ఉగ్రవాదులు ఉండటానికి ఓ వ్యక్తి ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు గుర్తించారు.
భాగ్యనగర్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జాహెద్ ముఠాపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఏ విచారించనుంది. డిసెంబర్ 2022 నెలలో, జాహెద్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా తరన్ తరణ్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఈ తెల్లవారుజామున రాకెట్ లాంచర్ తరహా ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తేలికపాటి రాకెట్‌తో ఉగ్రవాదులు దాడి చేశారని వెల్లడించారు.
Manipal University : బెంగుళూరులో ఓ స్టూడెంట్ ను ప్రొఫెసర్ టెర్రరిస్టు అని పిలవడం వైరల్ అయింది. చివరకు అతడు సస్పెండుకు గురయ్యారు. మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక ప్రొఫెసర్ తరగతిలో ఒక ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్'గా పిలిచాడు.
Facebook : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ షాక్ ఇచ్చారు. ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాను తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది.
జమ్ముకశ్మీర్‌లో ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్లో షోపియాన్ జిల్లాలోని కంజియులర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కంజియులర్ ప్రాంతంలో ఉగ్ర కార్యకలాపాలు జరగుతున్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భద్రతాబలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని, ఈ సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని వెల్లడించారు. వారు లష్కరే తొయీబాకు చెందినవారని, వారిలో ఒకరు షోపియాన్‌కు…