ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకొన్న చర్యలను ఎంపీ శశిథరూర్ భారత కాన్సులేట్‌లో చెప్పుకొచ్చారు. పహల్గాంలో మతం ఆధారంగా టూరిస్టులపై ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు.
భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపిందన్నారు. ఉగ్రవాద దేశం వల్ల మేము చాలా మంది అమాయక ప్రాణాలను కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమస్య పాకిస్తాన్ నుంచి మాత్రమే ఉద్భవిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడంఆపివేసే వరకు ఈ సమస్య తొలగిపోదని ఒవైసీ అన్నారు.