గ్యాంగ్‌స్టర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. గ్యాంగ్‌స్టర్లు, టెర్రర్ గ్రూపులు, డ్రగ్స్ మాఫియా మధ్య సంబంధానికి సంబంధించిన కేసులకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) ఎనిమిది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తోందని అధికారులు తెలిపారు.
పంజాబ్ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతోందా? అసెంబ్లీ ఎన్నికల ముందు కల్లోలానికి కుట్ర జరుగుతోందా..అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. అదే నిజమైతే రెండున్నర దశాబ్దాల పంజాబ్ శాంతి ప్రమాదంలో పడుతుంది. ఖలిస్తాన్ ఉద్యమం రగిలితే పరిస్థితి ఎలా వుంటుందో గత చరిత్ర చెబుతోంది. రాష్ట్రంలో మళ్లీ ఉగ్ర అలజడికి ఖలిస్తాన్ ఉగ్రసంస్థలు ప్రయత్నించ వచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. డిసెంబర్ 23న జరిగిన లూథియానా పేలుళ్ల కేసులో సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే)తో సంబంధం ఉన్న…
పాక్‌లో ఉద్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. పాక్‌లో ఉన్న ఆ ఉగ్రసంస్థలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో మారణహోమాలను సృష్టిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు పాక్ ఇంటిలిజెన్స్ సహకారం ఉందనన్నది బహిరింగ రహస్యమే. ఇక ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ పాక్‌లోని ఉగ్రసంస్థలపై కీలక పరిశోధన చేసింది. టెర్రరిస్ట్ అండ్ అదర్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్థాన్ పేరిట ఓ నివేదికను తయారు చేసి క్వాడ్ సదస్సు రోజున రిలీజ్…